గిద్దలూరు: కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, ముగ్గురికి స్వల్ప గాయాలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం అదుపుతప్పి ఒక కారు డివైడర్ ని ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమయానికి కారులోని బెలూన్లు తెచ్చుకోవడంతో ప్రమాదం నుంచి క్షతగాత్రులు సురక్షితంగా బయటపడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రోడ్డు డిజైన్ లోపం వల్ల ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానిక ప్రజలు వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.