కరకగూడెం: అశ్వాపురంలో ఆటో డ్రైవర్ల నిజాయితీ: పోగొట్టుకున్న బ్యాగును బాధితుడికి అప్పగింత
అశ్వాపురంలో మర్చిపోయిన విలువైన వస్తువుల బ్యాగును ఆటో డ్రైవర్లు రమణయ్య, నాగుల్ మీరా, వెంకటేశ్వర్లు, బాల శ్రీను, రాంబాబు, ప్రసాద్ లు సీఐ ఎల్లయ్యకు అందజేశారు. ఇందులో రూ. 5వేల నగదు ఉంది. సీఐ బాధితుడు ఆదిత్యకు బ్యాగును అప్పగించి, ఆటో డ్రైవర్లను అభినందించారు.