కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ స్టేషన్ల తనిఖీ చేపట్టిన ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ, నిర్మాణ పనులపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.