కొండపి: ఉప్పలపాడులో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు
కొండపి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఓ బాలిక పట్ల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశామని కొండేపి సీఐ సోమశేఖర్ తెలిపారు . బాలికను తల్లిదండ్రులు పనులకు వెళ్తూ ఇంటిలో వదిలి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన వృద్ధుడు బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వృద్ధుడిపై పోలీసులు ఫోక్సీ కేసు నమోదు చేశారు.