కొండపి: పొన్నలూరు ఎంపీడీవో సుజాత ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహణ
పొన్నలూరు మండల సర్వ సభ్య సమావేశం మండల ఎంపీపీ కొండబత్తిన మాధవ అధ్యక్షతన ఎంపీడీఓ సుజాత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులలో ఫీల్డ్ అసిస్టెంట్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వైసీపీ సానుభూతిపరుల నుంచి రూ.100 వసూలు చేసి మస్టర్లు వేస్తున్నారని అన్నారు. సరైన ఆధారాలతో మాట్లాడుతున్నామని తెలిపారు.