కొండపి: సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పేదల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తన సొంత గ్రామంలో టూరిజం ఛైర్మన్ బాలాజీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించారన్నారు