కొండపి: పొన్నలూరు మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
పొన్నలూరు మండలంలోని జడ్. మేకపాడు, కోటపాడు, చెన్నిపాడు గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.