కొత్తగూడెం: ఈ-చలాన్ మెసేజ్ తో రూ.85 వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. వాట్సాప్ కూడా హ్యాక్!
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఈ-చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేసి షేక్ అసిఫ్ అనే వ్యక్తి రూ.85 వేలు నష్టపోయారు. బాధితుడి వాట్సాప్ ఖాతాను సైతం నేరగాళ్లు హ్యాక్ చేశారు. గుర్తుతెలియని లింకులు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.