మహబూబాబాద్: వైద్య విద్యార్థుల కోసం శరీరదానం చేసిన వృద్ధురాలు
మహబూబాబాద్ జిల్లాకు చెందిన దర్శనం వెంకటమ్మ(76) మరణానంతరం తన పార్థివ దేహాన్ని మానుకోట మెడికల్ కాలేజీకి దానం చేశారు. ఆమె కుటుంబ సభ్యుల నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావి వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం ఈ దానం ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెలిపారు.