మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లాల ఉషు క్రీడలు
మహబూబాబాద్‌లో 4వ అంతర్ జిల్లాల ఉషు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. 280 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ క్రీడ ద్వారా లభించే అవకాశాలను అసోసియేషన్ కార్యదర్శి సతీష్ వివరించారు.