కురవి: యూపీఐ చెల్లింపులపై చార్జీలు వద్దు: మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నేతలు
యూపీఐ లావాదేవీలపై 0.4% చార్జీలు విధిస్తున్న కేంద్రంపై సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల సామాన్యులపై భారం పడుతుందని, వెంటనే ఈ చార్జీలను రద్దు చేయాలని కురవిలో జరిగిన సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.