ముగ్పాల్: కంజర్లో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడా పోటీలు
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన అన్నారు.