రుద్రూర్: ఆటోపై విరిగిన భారీ మర్రిచెట్టు.. 5గురికి తీవ్ర గాయాలు
రుద్రూర్ సమీపంలో ఆటోపై మర్రిచెట్టు విరిగిపడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దగుట్ట నుంచి బోధన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బోధన్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసిన అధికారులు.