రాయదుర్గం: పట్టణంలోని 6 వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
రాయదుర్గం పట్టణంలోని 6 వ వార్డు లో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా సన్మానించారు. శనివారం మద్యాహ్నం పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్, మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్చార్జ్ పొరాళ్ల పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు గురప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు.