రాయదుర్గం: రాయదుర్గంలో ఆటో ర్యాలీతో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణ ఆటో డ్రైవర్లు నిర్వహించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఆటో స్టాండ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన డ్రైవర్లు, తమ ఆటోలకు త్రివర్ణ జెండాలు కట్టి దేశభక్తిని చాటారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆటో ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణాలతో కదిలిన ఆటోలు, "భారత్ మాతాకీ జై" నినాదాలతో వాతావరణం జాతీయ ఉత్సాహంతో నిండిపోయింది.