బయ్యారం: బయ్యారం కొత్తపేటలో బస్సుల నిలుపుదలపై మహిళల ధర్నా
బయ్యారం మండలం కొత్తపేటలో బస్సులు ఆపడం లేదని మహిళలు నిరసన తెలిపారు. గతంలో ఆగినట్లుగానే ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు తమ గ్రామంలో ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న బస్సు స్టాప్ ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.