బయ్యారం: బయ్యారంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో స్థానిక రామాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కోదండరామస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ పబ్లిక్ రిలేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఈ వేడుకలకు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు.