బయ్యారం: చొక్లతండా నుండి బయ్యారం మండల కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని, CPI MLన్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దర్నా
మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండల పరిధి,చొక్లాతండా నుండి వెంకట్రాంపురం మీదుగా బయ్యారం మండల కేంద్రానికి. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమేచేపట్టాలని డిమాండ్ చేస్తూ. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందిగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,బిటి రోడ్డు మంజూరై. పనులు ప్రారంభించి సుమారుగా ఐదు నెలలు కావస్తున్న,నేటివరకు రోడ్డుకు ఇరువైపుల మట్టి పనులు అరకొరగా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు