బయ్యారం: తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, అమలు చేయాలని బయ్యారంలో పోస్ట్ కార్డుల ఉద్యమం
గత అసెంబ్లీ ఎన్నికలలో, తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ, బయ్యారం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో,పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,.. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం,25 వేల రూపాయల పెన్షన్, ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేసి, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, తదితర హామీలను గుర్తు చేస్తూ పోస్టుకారులను సీఎంకు పోస్ట్ చేశారు.