సంతనూతలపాడు: చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామ పొలాల్లో శుక్రవారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని చీమకుర్తి SI అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 8 మందిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని SI ప్రజలకు సూచించారు.