గుండాల: సుద్దాల గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మ దహనం
మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సుద్దాల గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.