బండకొత్తపల్లి గ్రామంలో బోనాల పండుగలో ట్రాక్టర్‌తో ప్రదక్షిణ చేస్తుండగా అదుపుతప్పి వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్త పెళ్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాల్లో గ్రామస్తులు వాహనాలను అలంకరించి ఊరంతా ముత్యాలమ్మ ఆలయానికి ప్రదక్షణ చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది.ఈసారి కూడా అదే ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రామగిరి శ్రీరాములు(52) వ్యక్తిని ఢీ కొట్టింది.దురదృష్టవశాత్తు ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.