పదేళ్ల పాలనలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవానికి ఇండ్లు ఇవ్వలేదు: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలించేందుకు సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించి, ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ ఒక్క పేదవానికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు పథకం తీసుకొచ్చిందన్నారు. నియోజకవర్గంలో 3500 ఇండ్లు చేయడం జరిగిందని, నిర్మాణం జరుగుతుందన్నారు.