మాసాన్ పల్లిలో రేషన్ బియ్యం అక్రమ నిలువలపై దాడులు నిర్వహించిన ఎస్ఓటి పోలీసులు, 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల పరిధిలోని మాసాన్ పల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఎస్ఓటి పోలీసులు స్టేషన్ బియ్యం అక్రమ నిలువలపై దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మోత్కూరు మండలంలోని ఓ రేషన్ షాప్ నుండి ప్రతి నెల 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం దందాకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.