పేదవాడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాకారం అయింది: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల కేంద్రంలో 400 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేదవాడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరింది అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి సొంత ఇంటిని నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. మంజూరు పత్రాలు పొందిన వారు త్వరితగతిన తమ ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.