బండ కొత్తపల్లి గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి
గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు గంగాపురం రామకృష్ణ గురువారం అర్ధరాత్రి ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. ధాన్యం తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం ఉదయం గ్రామస్తులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.