భీంగల్: మెండోరా పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ సీపీ ఆకస్మిక తనిఖీలు, సిబ్బందికి కీలక ఆదేశాలు
మెండోరా పోలీస్ స్టేషన్ను నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణను పరిశీలించి, మహిళలు, బాలికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. విధుల్లో హెల్మెట్ తప్పనిసరి అని, పుష్కరాలకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.