కొండపి: మర్రిపూడి మండలం జుమ్మికుంట గ్రామంలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జుమ్మిగుంటలో పేకాట ఆడుతున్న 9 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9690 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట సమాచారం తెలిస్తే స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.