రాయదుర్గం: 200 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ, జాతీయ భావం చాటిన ఊరేగింపు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పురస్కరించుకుని శుక్రవారం రాయదుర్గం పట్టణంలో 200 అడుగుల జాతీయ జెండాతో భారీ ఊరేగింపు నిర్వహించారు. AISF, AIYF ఆధ్వర్యంలో స్థానిక ఏపి మోడల్ స్కూల్ నుంచి వేలాది మంది విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టి ర్యాలీలో పాల్గొన్నారు. "వందేమాతరం", 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదాలతో సాగిన ఈ ఊరేగింపు దేశభక్తిని చాటింది. విద్యార్థుల ఉత్సాహం, దేశభక్తి ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘాల నేతలు కలుగోడు ఆంజనేయులు, కావలి కొట్రేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం విద్యార్థి ఉద్యమాలు నిర్మించి న ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ ది అన్నారు.