ఆలేరు: నిండుకుండలా మారిన టంగుటూరు మల్లన్న చెరువు: ఆనందంలో గ్రామస్తులు
Alair, Yadadri | Oct 1, 2026 ఆలేరు మండలం టంగుటూరులో మల్లన్న చెరువు అలుగు దూకుతోంది. ఎస్సారెస్పీ కాలువల ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా ఈ చెరువు నిండింది. ఎమ్మెల్యే బీర్ల అయిలన్న కృషితో తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.