ఆలేరు: ఆలేరు పట్టణంలో బైక్ పల్టీ కొట్టి యువకుడికి గాయాలు
Alair, Yadadri | Sep 22, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బైకు అదుపుతప్పి యువకుడికి గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది ఈ సందర్భంగా ఆరు లేరు పట్టణవాసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన మహేష్ జనగామ నుంచి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఆలేరు పట్టణంలోని దుర్గమ్మ గుడి దగ్గర అద్భుతప్పి డివైడర్ కు బుల్లెట్ బైక్ తాకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి .గమనించిన ఐసీడీఎస్ అధికారులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మహేష్ బంధువులకు సమాచారం అందించారు.