ఆలేరు: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ: ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Alair, Yadadri | Sep 24, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని నాలుగో వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో భాగంగా బుధవారం ఆలేరు పట్టణంలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్ల ఐలయ్య ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇండ్ల మంజూరు చేసిందని దానితో పాటు 200 ఇండ్లు అదనంగా ఇచ్చిందని ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.