ఆలేరు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించిన ప్రగతిశీల యువజన సంఘం
Alair, Yadadri | Sep 18, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం మధ్యాహ్నం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి బేజారి కుమార్, జిల్లా అధ్యక్షుడు మారోజు సిద్దేశ్వర మాట్లాడుతూ.. ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంగా మారిందని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాధుడే లేడు కరువయ్యాడని, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.