ఆలేరు: ఆలేరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పోటీ: సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెక్క వెంకటేష్
Alair, Yadadri | Oct 1, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా: స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పిటిసి వరకు జరిగా అన్ని ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో సిపిఐ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సిపిఐ అభ్యర్థి గెలుపుతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.