ఆలేరు: తగ్గించిన జిఎస్టి ప్రకారం కిరాణా షాపుల్లో వస్తువులు ధరలను తగ్గించాలి:పీవై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమార్
Alair, Yadadri | Sep 23, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా: 2017 నుంచి ప్రజల సొమ్మును జిఎస్టి పేరుతో దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ లో మార్పు చేసింది.22 సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన జిఎస్టి విధానం ప్రకారం కిరాణా దుకాణాల్లో నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమార్ అన్నారు .మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పివైఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.