సంతనూతలపాడు మండలం మంగమూరులో రైతన్న.. మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో శ్రీనివాసరావు సమావేశం అయ్యారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. గ్రామంలో రైతు కుటుంబాల సర్వే కార్యక్రమాన్ని పక్కగా చేపట్టాలని వ్యవసాయ శాఖ సిబ్బందిని శ్రీనివాసరావు ఆదేశించారు .వ్యవసాయాన్ని లాభ సాటిగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.