దర్శి: తాళ్లూరు మండలం మాధవరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై దాడి
Darsi, Prakasam | May 15, 2025 తాళ్లూరు మండలం మాధవరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గురువారం పిచ్చి కుక్కల దాడిలో సాయి, లక్ష్మి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే ఒంగోలు రిమ్స్కు తరలించారు. పిచ్చి కుక్కల బెడద నివారించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.