కొత్తగూడెం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయండి: కాంగ్రెస్ విన్నపం
నల్లగొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ, పాల్వంచలో కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.