నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు డి.సి.పి శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీజీ అహింస, సత్యాగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.