నవీపేట్: నవీపేట క్రషర్ వద్ద ప్రమాదం: క్రేన్ కొక్కెం పడి కూలీ మృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలలో క్రషర్ వద్ద ప్రమాదం జరిగింది. క్రేన్ కొక్కెం తెగి కూలీపై పడటంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.