దర్శి: దర్శి ఎన్ఎస్పి కార్యాలయం సమీపంలో ప్రమాదవశాత్తు దగ్ధమైపోయిన ప్లాస్టిక్ పైపులు
Darsi, Prakasam | Aug 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఎన్ ఎస్ పి కార్యాలయం సమీపంలో ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ పైపులు దగ్ధమైపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్లాస్టిక్ పైపులు దహనం కావడంతో నల్లటి పొగలు కమ్మేసాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ప్లాస్టిక్ పైపులు సగం కాలిపోయినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.