జడ్చర్ల: పోలేపల్లి గ్రామంలో చంటి పిల్లల ముడ్లు కడగడానికి నీళ్లు లేవు .మహిళల ఆవేదన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో తీవ్ర తాగునీటి అవస్థలు నెలకొన్నాయి. శుక్రవారం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి అవసరాల కోసం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గానికి అతి దగ్గరగా ఉండే మా గ్రామంలో తాగునీటి అవస్థలు ఏంటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.