జడ్చర్ల: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం కేసు నమోదు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై హత్యాయత్నం జరిగిన ఘటన గురువారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. రాజాపూర్ మండలం కేస్యనాయక్ తాండాకు చెందిన బాలు నాయక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొన్ని రోజులుగా ఓ వ్యక్తితో భూతగాదాలు ఉన్నాయి. గురువారం ఉదయం బాలానగర్ మండలం చిన్నంగుల గడ్డ తండా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాలు నాయక్ పై కత్తులతో దాడి చేయగా తప్పించుకున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.