పాల్వంచ: పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
పాల్వంచ సమీపంలోని అనుబోస్ కాలేజ్ వద్ద ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బిల్లు తండాకు చెందిన భూక్య సామ్య (37) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.