సంతనూతలపాడు: చీమకుర్తి మండలం బండ్లమూడి ఎస్సీ కాలనీలో ఓవర్గంపై మరో వర్గం కర్రలతో దాడి
చీమకుర్తి మండలంలోని బండ్లమూడి ఎస్సీ కాలనీలో ఇరువర్గాల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో ఓవర్గం మరో వర్గం వారిపై దాడి చేసింది. పోలీసులు ఈ దాడిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. పంట భూముల ధ్వంసం విషయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.