రాజేంద్రనగర్: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : మీర్పేటలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాన్ని ఆమె ఆదివారం పరిశీలించారు. వాలీబాల్ కోర్టు, క్రికెట్ మైదానం, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం క్రీడాకారుల అవసరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారి డీఈ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.