మార్కాపురంలో ‘కౌశలం జాబ్ మేళా’ – నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం.
మార్కాపురం, 6.9.26
జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఎస్ జి ఎస్ డబ్ల్యూ వింగ్) ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 7, 2026 - సోమవారం) మార్కాపురంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మార్కాపురం జిల్లాలోని వివిధ మండలాలు మరియు పట్టణాలకు చెందిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 'స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు' ద్వారా ఇప్పటికే నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకున్న అభ్యర్థులతో పాటు, కొత్తగా హాజరయ్యే వారికి కూడా నేరుగా 'స్పాట్ రిజిస్ట్రేషన్' సదుపాయం కల్పించబడుతుందని తెలియజేశారు.
ఉద్యోగ మేళా వివరాలు:
రైజింగ్ కంపెనీ: ZF RANE Automotive India Pvt. Ltd
ఖాళీగా ఉన్న పోస్టులు: మెషిన్ ఆపరేటర్ (Machine Operator)
తేదీ & సమయం: 07-09-2026 (సోమవారం), ఉదయం 08:00 గంటల నుండి
వేదిక: డ్వాక్రా బజార్ (DWACRA Bazaar), మార్కాపురం
అర్హులైన యువతీ యువకులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్, పాస్