🚨 **కుక్కకాటు బాధితుడికి వ్యాక్సిన్ లేదు.. ప్రశ్నిస్తే కుక్కలను దాడి చెయ్యలేక మా పై దాడికి వచ్చారా అంటూ క్రింది స్థాయి ఉద్యోగి దురుసు సమాధానం!**
**తర్లుపాడు:** స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఓ బాధితుడు మార్కాపురం వెళ్లి టీకా వేయించుకున్నాడు. రెండో డోస్ కోసం తిరిగి తర్లుపాడు పీహెచ్సీకి వచ్చిన బాధితుడు.. వ్యాక్సిన్ లేకుంటే ఎలా అని వైద్యుడిని ప్రశ్నిస్తుండగా, వైద్యుడు వివరణ ఇస్తున్న సమయంలో ఓ క్రింది స్థాయి ఉద్యోగి **“కుక్కలను దాడి చేయకుండా మా పై దాడికి వస్తారా?”** అంటూ దురుసుగా మాట్లాడినట్లు బాధితుడు ఆరోపించారు.
అత్యవసరమైన కుక్కకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై అధికారులు స్పందించి, బాధితులతో మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.