గాజులపల్లెలో భారీ అగ్ని ప్రమాదం
సర్వం కోల్పోయామంటూ బాధితులు ఆవేదన
లక్షల్లో తీవ్ర నష్టం..
నంద్యాల జిల్లా మహానంది మండలం
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో రాజు బైక్ మెకానిక్ షాప్ దగ్ధమైన ఘటన మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రాజు అనే వ్యక్తికి గాజులపల్లె మెట్టలో బైక్ మెకానిక్, స్పేర్ పార్ట్స్ షాపు ఉందన్నారు. రాత్రి ఎప్పటిలాగే షాపు మూసివేసి వెళ్లారన్నారు. అర్ధరాత్రి సమయంలో షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చలరేగాయి అన్నారు.స్థానికులు, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేదన్నారు.అప్పటికే షాపులోని 8 బైకులు, స్పేర్ పార్ట్స్, ఆయిల్ క్యాన్లు కాలిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఎన్