నందిపేట: నందిపేటలో 6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మూసివేత - అధికారులు తనిఖీలు
నందిపేటలో అసిస్టెంట్ కలెక్టర్ సాయి సురేష్ ఆధ్వర్యంలో 6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేకపోవడం, సింథటిక్ రంగులు మరియు పరిశుభ్రత లోపం కారణంగా ఆయా సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నాణ్యత లేని ఆహారంపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.